బిగ్ అలర్ట్: తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల

బిగ్ అలర్ట్: తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన శనివారం (మే 24) పాలిసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. 83 వేల 364 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలను పాలిసెట్ అధికారిక వెబ్ సైట్‎లో అందుబాటులో ఉంచామని.. అభ్యర్థులు అక్కడ ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2025, మే 13న పాలిటెక్నికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్–2025) ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 246 ఎగ్జామ్ సెంటర్లలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. 

ఈ ఎగ్జామ్కు 1,06,716 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, వారిలో 98,858 మంది పరీక్షకు అటెండ్ అయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 57,178 మంది బాయ్స్‎కు 53,086(92.84%) మంది, బాలికలు 49,538 మందికి 45,772 (92.4%) మంది ఎగ్జామ్‎కు హాజయ్యారని వెల్లడించారు. ఓవరాల్‎గా 92.64 హాజరు శాతం నమోదైందని వెల్లడించారు.