TGPSC మరో గుడ్ న్యూస్: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

TGPSC మరో గుడ్ న్యూస్: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్​సీ) ట్రాన్స్​పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖల్లో అసిస్టెంట్ ఎన్విరాన్​మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 19.

విభాగాల వారీగా ఖాళీలు: అన్ రిజర్వ్​డ్ 8, ఈడబ్ల్యూఎస్ 2, బీసీ–2, బీసీ–బీ–1, బీసీ–సీ 0, బీసీ–డీ 1, బీసీ–ఈ 0, ఎస్సీ–I 0, ఎస్సీ-–II 1, ఎస్సీ-–-III 1, ఎస్టీ 11, పీహెచ్ 2).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ  సివిల్ / మెకానికల్ / కెమికల్ / బయో-టెక్నాలజీ / మైనింగ్ / ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఏదైనా విభాగంలో బి.టెక్/ బీఈతోపాటు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ లకు ఐదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మన్, ఎన్ సీసీ అభ్యర్థులకు మూడేళ్లు  వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 10.

అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.500.

ఎగ్జామినేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.120 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: జులై 17.

రాత పరీక్ష: 2026, సెప్టెంబర్ (తాత్కాలికం). 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.tgpsc.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-–Iలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్–-II సివిల్ సంబంధిత సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు.  పేపర్–-I ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్–-II కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది.