లాభాలు రాకుంటే 4 నెలల్లో ఆర్టీసీ ప్రైవేట్ పరం

లాభాలు రాకుంటే 4 నెలల్లో ఆర్టీసీ ప్రైవేట్ పరం
  • సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారన్న ఆర్టీసీ కొత్త చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్‌ (ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల క్రితమే చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన నిన్న సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ రివ్యూలో పాల్గొన్నారు. ఈ రివ్యూలో గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పిడుగు లాంటి వార్త చెప్పారు. మరో నాలుగు నెలల్లో ఆర్టీసీ నష్టాల నుంచి కోలుకుని గాడిలో పడకుంటే ప్రైవేటు పరం చేసేస్తామని సీఎం కేసీఆర్ అన్నారని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

ఆర్టీసీ బలోపేతానికి సీఎం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, ఆయన అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు. లాభాలు తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని, నష్టాలోస్తే కార్మికులు, అధికారులు అందరూ రోడ్డున పడతారని కొత్త చైర్మన్ బాజిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు, అధికారులు సక్కగా పనిచేసుకోవాలని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

సూసైడ్ నోట్: ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తాడనే ఆత్మహత్య

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

15 మందిని చంపిన పులి కోసం సెర్చ్ ఆపరేషన్

మతమార్పిడుల కేసు: మౌలానా సిద్ధిఖీని అరెస్ట్ చేసిన ఏటీఎస్