ఆర్టీసీలో 3,038 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఎండీ సజ్జనార్  

ఆర్టీసీలో 3,038 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఎండీ సజ్జనార్  
  •  వెల్లడించిన ఎండీ సజ్జనార్  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు.

ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి, నియామక ప్రక్రియను పారదర్శకంగా,  మెరిట్ ఆధారంగానే పూర్తిచేస్తామని చెప్పారు. అడ్డదారుల్లో ఎవరికీ ఉద్యోగాలు రావని, ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే, వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.