ఓటర్ల జాబితాలను తనిఖీ చేయండి.. డీపీవోలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

ఓటర్ల జాబితాలను తనిఖీ చేయండి..  డీపీవోలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోగా తేల్చాలని హైకోర్టు సూచించినందున రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా  గ్రామ పంచాయతీల్లో పోలింగ్ స్టేషన్లవారీగా ఇప్పటికే ప్రచురించిన ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు(డీపీవో) రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ఓటర్ల  జాబితాల్లో ఏవైనా తప్పులు, సవరణలు అవసరమని గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే ఎస్ఈసీ కార్యాలయంలోని సంబంధిత నోడల్ అధికారుల దృష్టికి తేవాలని అన్ని జిల్లాల డీపీవోలకు సూచించింది. గుర్తించిన తప్పులను నివేదించడమే కాకుండా, అవి పూర్తిగా సరిదిద్దే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయాలని పేర్కొంది. తక్షణమే ఈ దిశగా చర్యలు చేపట్టాలని డీపీవోలను కోరింది.