మే 11 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

మే 11 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. మే 18 నుంచి 20 వరకు SSC, ఒకేషనల్  విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. మే 11న ఫస్ట్ ల్యాంగ్ వేజ్ పేపర్ 1, పేపర్ 2...మే 12న సెంకడ్ ల్యాంగ్ వేజ్, 13న ఇంగ్లీష్, 14న మ్యాథమెటిక్స్, 16న జనరల్ సైన్స్, 17న సోషల్ స్టడీస్, మే 18న ఓపెన్ SSC మెయిన్ లాంగ్వేజ్ పేప ర్ 1,  19న ఓపెన్ SSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, మే 20న SSC ఒకేషనల్ కోర్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు వరకు కొనసాగుతుందని వివరించింది బోర్డు.