
- గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం డ్రాఫ్ట్, టీ-ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీపై చర్చించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ 16వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం డ్రాఫ్ట్, టీ-ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పునఃప్రారంభించడం, వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు,
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం, సమ్మక్క-సారక్క ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ పనుల వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్టు తెలిసింది. బనకచర్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చించనున్నారు.
వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం, బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ చిత్తశుద్ధి.. ఇంకా ఏం చేయాలనే దానిపైనా కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.