గూగుల్ డూడుల్ తో మెరిసిన ఇడ్లీ: అసలు ఇడ్లీ వంటకం ఎక్కడ పుట్టింది, దీని చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా..

గూగుల్ డూడుల్ తో మెరిసిన ఇడ్లీ: అసలు ఇడ్లీ వంటకం ఎక్కడ పుట్టింది, దీని చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా..

గూగుల్ హోమ్‌పేజీలో ఇవాళ ముఖ్యంగా భారతీయులకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది, ఏంటంటే గూగుల్  స్పెషల్ డూడుల్‌తో ఇడ్లీని హై లెట్ చేస్తూ చూపిస్తూ ప్రజలను ఆశ్చర్యాపరిచింది. ఇడ్లీ అందరికీ ఇష్టమైన సౌత్ ఇండియన్ ఫుడ్. వివిధ రకాల చట్నీలతో తినే ఈ మెత్తని, ఉడికించిన వంటకం నేటి గూగుల్ డూడుల్‌లో ప్రధానంగా ఉంది.

మీరు గూగుల్ బ్రౌజర్‌ ఓపెన్ చేసి డూడుల్‌పై క్లిక్ చేస్తే ఈ డిష్ గురించి ఒక చిన్న note కనిపిస్తుంది. అందులో నేటి డూడుల్ ఇడ్లీని జరుపుకుంటుంది, ఇది బియ్యం, మినపప్పుతో తయారు చేసిన రుచికరమైన, ఉడికించిన దక్షిణ భారత ఫేమస్ టిఫిన్ అని ఉంది. 

డూడుల్ ఎం చూపిస్తోందంటే : Google పదంలోని ఒక్కో అక్షరం ఈ వంటకంలోని వేర్వేరు అంశాలను చూపిస్తున్నాయి. మొదటి G తెల్లటి చిన్న గింజతో అంటే ఇడ్లీకి ముఖ్యమైన బియ్యం గింజలను  చూపిస్తుంది. తరువాత O అక్షరం ఒక గిన్నెలో ఉంచిన నానబెట్టిన బియ్యంని చూపిస్తుంది. తరువాత  రెండవ O అక్షరం ఇడ్లీ గిన్నెలో ఇడ్లీ పిండిని చూపిస్తుంది. తరువాత G అక్షరం రెడీ చేసిన ఇడ్లీలను చూపిస్తుంది. L అక్షరాన్ని ఇడ్లీతో తినే చట్నీలను  చూపిస్తుంది.  చివరి అక్షరం E  ఇడ్లీ డిష్‌ ఆస్వాదిస్తున్నట్లు ఉంటుంది.

మొత్తం అరటి ఆకుపై : డూడుల్ దీని గురించి మరింత వివరిస్తూ, గూగుల్ ఈ ఇడ్లీ ఫోటోని ఫుడ్ అండ్ డ్రింక్ డూడుల్ థీమ్‌లో భాగంగా 1 అక్టోబర్ 2025న ప్రత్యేకంగా ఇండియా కోసం విడుదల చేసినట్లు రాసి రాసింది.

ఇడ్లీ  ఎక్కడ పుట్టిందంటే :  ఇడ్లీ భారతదేశంలోనే పుట్టిందని చాలామంది నమ్మకం. అయితే, ఆహార ప్రియులు మాత్రం ఇడ్లీ విదేశంలో  పుట్టి ఉండొచ్చని వాదిస్తున్నారు. 2018 రిపోర్టులో ప్రముఖ ఆహార చరిత్రకారుడు కె.టి. అచాయ ఈ ఇడ్లీ వంటకం మధ్యయుగంలోని ఇండోనేషియా వంటకం నుండి వచ్చిందని సూచించారని వీర్ సంఘ్వీ తెలిపారు.