అపెక్స్ బ్యాంక్ లో 40 మేనేజర్ ఉద్యోగాలు

అపెక్స్ బ్యాంక్ లో 40 మేనేజర్ ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌‌ లిమిటెడ్​ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీస్‌‌సీఏబీ శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్​లైన్​లో అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 

పోస్టులు

మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. మేనేజర్(స్కేల్-1)– 27, స్టాఫ్ అసిస్టెంట్– 13 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్​​

మేనేజర్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్) ఆధారంగా, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా నియమిస్తారు.

అప్లికేషన్స్​

ఆన్​లైన్​లో అక్టోబర్​ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250) ఉంటుంది. ప్రిలిమ్స్​ పరీక్ష నవంబర్​లో నిర్వహిస్తారు. వివరాలకు  www.tscab.org వెబ్​సైట్​ సంప్రదించాలి. 

సెంట్రల్ బ్యాంక్​ స్పెషలిస్ట్  ఆఫీసర్​

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్​ కేటగిరీలో పోస్టుల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: మొత్తం 110 ఖాళీలు ఉన్నాయి. ఇందులో  ఐటీ, ఎకనామిస్ట్​, డేటా సైంటిస్ట్​, రిస్క్​ మేనేజర్​, ఐటీ ఎస్‌‌ఓసీ అనలిస్ట్‌‌, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్), క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజినీర్, లా ఆఫీసర్, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత

సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్‌‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్​ ఫీజు రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175) చెల్లించాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో  అక్టోబర్​ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం  www.centralbankofindia.co.in వెబ్​సైట్​ చెక్​ చేసుకోవాలి.