
హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్), క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ట్రై క్రీడా వేడుక జరగనుంది. నెక్లెస్ రోడ్ లో సైక్లింగ్, ఇందిరా పార్కు లో స్కేటింగ్, యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా నిర్వహించే ఈ పోటీల బ్రోచర్‌ను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ శనివారం రిలీజ్ చేశారు. స్టేట్ సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయన్నారు.