శ్రీజకు ఫీడర్‌‌‌‌‌‌‌‌ బీరుట్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌

శ్రీజకు ఫీడర్‌‌‌‌‌‌‌‌ బీరుట్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌ టీటీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆకుల శ్రీజ.. డబ్యూటీటీ ఫీడర్‌‌‌‌‌‌‌‌ బీరుట్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసు కుంది. లెబనాన్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం రాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ 47వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ శ్రీజ 6–11, 12–10, 11–5, 11–9తో సారా డి నుట్‌‌‌‌‌‌‌‌ (లక్సెంబర్గ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది. శ్రీజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది రెండో డబ్ల్యూటీటీ టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. జనవరిలో తెలుగమ్మాయి.. ఫీడర్‌‌‌‌‌‌‌‌ కార్పస్‌‌‌‌‌‌‌‌ క్రిస్టీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. తాజా విజయంతో శ్రీజకు 125 ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు లభించాయి.

విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో శ్రీజ–దియా చటాలె 11–4, 9–11, 7–11, 6–11తో డు హోయ్‌‌‌‌‌‌‌‌ కెమ్‌‌‌‌‌‌‌‌–జు చెంగ్జూ (హాంకాంగ్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో మనవ్‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌–మనుష్‌‌‌‌‌‌‌‌ షా 11–7, 11–5, 9–11, 11–6తో ముదిత్‌‌‌‌‌‌‌‌ డాని–ఆకాశ్‌‌‌‌‌‌‌‌ పాల్‌‌‌‌‌‌‌‌పై నెగ్గగా, మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ పాల్‌‌‌‌‌‌‌‌–పోమెటీ బైసా 11–9, 7–11, 11–9, 11–0తో సత్యన్‌‌‌‌‌‌‌‌–మనికా బాత్రాను ఓడించి టైటిల్స్‌‌‌‌‌‌‌‌ను సాధించారు.