అదేం లేదు, అదంతా అబద్దం : కేంద్రం ఫ్రీ టోల్ పాస్ స్కింపై తెలంగాణ క్లారిటీ..

అదేం లేదు, అదంతా అబద్దం : కేంద్రం ఫ్రీ టోల్ పాస్ స్కింపై తెలంగాణ క్లారిటీ..

జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేల కోసం కేంద్రం త్వరలో ప్రారంభించనున్న ఫ్రీ టోల్ పాస్ స్కింకి తెలంగాణ ప్రైవేట్  వాహనదారులు అర్హులు కాదు అంటూ ఓ వార్త హల్చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఫాక్ట్ చెక్  Xలో ఓ ట్వీట్ చేసింది.  అందులో దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది.  తెలంగాణలో రిజిస్టరైన వాహనాల డేటాను ఇప్పటికే సెంట్రల్ వాహన్ డేటాబేస్‌కు పంపామని, తెలంగాణలో రిజిస్టరైన వాహనాల సమాచారం మా వద్ద ఉందని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కూడా స్పష్టం చేసిందని చెప్పింది. 

ALSO READ | తెలంగాణ కార్ ఓనర్లకు షాక్.. కేంద్రం ఫ్రీ టోల్ పాస్ స్కీమ్ కట్.. !

తెలంగాణలో రిజిస్టరైన వాహనాల సమాచారం మాకు అందుబాటులో ఉందని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కూడా తెలపగ,   ఫాస్ట్‌ట్యాగ్ అన్యువల్ టోల్ పాస్ తెలంగాణలోని అన్ని ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కార్ల యజమానులు అన్యువల్ టోల్ పాస్ స్కీమ్‌ పొందలేరు అనేది పూర్తిగా తప్పు సమాచారం అని చెప్పింది.