వేములవాడ రాజన్న ఆలయానికి భారీ ఆదాయం.. రాజన్నకు రూ. 1.65 కోట్ల ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి భారీ ఆదాయం.. రాజన్నకు రూ. 1.65 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. గత 20 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం ఆలయ ఓపెన్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లో లెక్కించారు. హుండీల ద్వారా మొత్తం రూ. 1.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో వినోద్‌‌‌‌ తెలిపారు. అలాగే 204.500 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి వచ్చినట్లు చెప్పారు. కరీంనగర్‌‌‌‌ సహాయ కమిషనర్‌‌‌‌ కార్యాలయ అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.