ఇరాక్ లో చిక్కుకు పోయిన తెలంగాణ  కార్మికులు

ఇరాక్ లో చిక్కుకు పోయిన తెలంగాణ  కార్మికులు
  • 150మందితెలంగాణ కార్మికుల అవస్థలు
  •  ఫైన్ మాఫీ అయినా ఫ్లైట్ లేక రాలేని పరిస్థితి
  •  ఎంబసీ అధికారి మోసం చేశారని ధర్నా

ఉపాధికోసం వెళ్లిగడువు ముగిసిన తెలంగాణ వారు ఇరాక్ లో ఇరుక్కుపోయారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ నుంచి 150 మంది వరకు ఇరాక్ లోని కుర్బిస్థాన్ వెళ్లారు. గడువు ముగిసిన తర్వాత అక్కడ ఉన్నందుకు గరామ (జరిమానా) చెల్లించాల్సి ఉంటుంది. ఒక స్వచ్చంద సంస్థ చొరవ జరిమానా మాఫీ చేయించినా.. ఎంబసీలోని ఒక అధికారి వల్ల తెలంగాణ వారికి బదులు ఇతర రాష్ట్రాల వారు ఇండియాకు తిరిగివెళ్లారు. గరామ క్లియర్ అయినా కరోనా వల్ల విమానాలు లేక తెలంగాణ వాళ్లు మాత్రం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇరాక్ లోని కుర్బిస్తాన్ రాష్ట్రంలోని ఎర్బిల్ నగరంలో చిక్కుకుపో యిన 150 మంది కార్మికులు తిరిగి రాలేక మూడు నెలల నుంచి తిప్పలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రామడుగుకు చెందిన పరిమల భోజన్న అనే కార్మికుడు సొంతూరుకు వెళ్తానో లేదోనన్న బెంగతో చనిపోయాడు. మరో ముగ్గురు కార్మికులు ఆస్పత్రిలో చేరారు. వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఇరాక్ నుంచి ఒక్క విమానం కూడా ఏర్పాటు చేయలేదని కార్మికులు వాపోతున్నారు.

 మనవాళ్ల పర్మిషన్ తో..

ఇరాక్ లో వీసా, పని చేసుకునేందుకు ఇచ్చే లైసెన్స్ గడువు ముగిసిపోవడంతో వీరిని అక్రమంగా నివసిస్తున్నవారిగా అక్కడి సర్కారు భావిస్తోంది. వీరికి కుర్బిస్తాన్ ప్రభుత్వం విధించిన ఫైన్ చెల్లిస్తే తప్ప దేశం విడిచి వెళ్లేందుకు అనుమతిస్తారు. అక్కడే ఉండే రాంచందర్ అనే స్వచ్ఛంధ సంస్థప్రతినిధి గరామా నుంచి మినహాయింపు ఇవ్వాలని మూడు నెలల కిందటే భారత కన్సూలేట్లో దరఖాస్తు చేశాడు. ఆయన ప్రయత్నాల వల్ల కార్మికులకు గరమా నుంచి మినహాయింపు వచ్చింది. ఎట్టకేలకు ఒక విమానం ఢిల్లీనుంచి వచ్చింది. అక్కడి ప్రభుత్వం గరామ మాఫీ చేయడంతో సొంత రాష్ట్రాలకు వెళ్తామని ఆశతో ఉన్న తెలంగాణ కార్మికులకు షాక్ తగిలింది. ఆదివారం రాత్రి ఎర్బిల్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో తెలంగాణ కార్మికులకు గరామ పర్మిషన్ తో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులను పంపించారు. ఇండియా కాన్సులేట్ లేని ఒక అధికారి తమను మోసం చేశాడని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్ అధికారి చంద్రమౌళి కె.కరణ్ తీరుకు నిరసనగా ఎంబసీ ముందు ఆందోళనకు దిగారు. మంగళవారం నుంచి మళ్లీ ఎర్బిల్ నగరంలో లాక్ డౌన్ విధించనుండటంతో.. తమను ఎలాగైనా ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలని ప్రాధేయపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని మన కార్మి కులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాంచందర్ కోరారు.