అహ్మదాబాద్: నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ అథ్లెట్ల హవా కొనసాగుతోంది. విమెన్స్ స్కీట్ షూటింగ్‌లో తెలంగాణ ఫ్లాగ్ బేరర్ రష్మీ రాథోడ్ సిల్వర్ మెడల్‌తో మెరిసింది. ఆదివారం క్రౌన్ షూటింగ్ అకాడమీలో జరిగిన ఫైనల్లో రష్మీ 25/30 స్కోరుతో రెండో ప్లేస్‌లో నిలిచింది. గునెమత్ సీకోన్ (పంజాబ్) 28/30 స్కోరుతో, శివాని రైక్వర్ (మధ్యప్రదేశ్) 17/30 స్కోరుతో వరుసగా గోల్డ్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించారు. తెలంగాణ బాస్కెట్‌బాల్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లో తెలంగాణ 21–14తో మహారాష్ట్రను ఓడించింది. తెలంగాణ తరఫున పుష్ప 13, అశ్వతి 5, అన్బరాశి 3 పాయింట్లు సాధించగా, దుర్గా (11), సియా (2), సాక్షి (1) మహారాష్ట్రకు పాయింట్లు అందించారు.
ఫైనల్లో తెలంగాణ
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై గెలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో విష్ణువర్ధన్–గాయత్రీ గోపీచంద్ 13–21, 21–16, 15–21తో చిరాగ్ షెట్టి–రితికా చేతిలో ఓడారు. సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21–10, 21–14తో వరుణ్ కపూర్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో విష్ణు వర్ధన్–సుమిత్ రెడ్డి 18–21, 21–19, 23–21తో చిరాగ్–విప్లవ్ కువాలేపై నెగ్గారు. విమెన్స్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–గాయత్రీ గోపీచంద్ 21–9, 21–16తో రితికా–సిమ్రాన్‌ను ఓడించి తెలంగాణకు విజయం అందించారు. స్క్వాష్ ఈవెంట్‌లో తెలంగాణ విమెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో తెలంగాణ 11–9, 11–9తో బిహార్‌ను ఓడించింది.
