ప్రీమియం మెంబర్స్ కోసం స్టిక్కర్ ప్యాక్స్ 

ప్రీమియం మెంబర్స్ కోసం స్టిక్కర్ ప్యాక్స్ 

యూజర్ల మెసేంజింగ్  ఎక్స్ పీరియన్స్ మెరుగుపరిచేందుకు టెలిగ్రామ్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ తో మొబైల్, డెస్క్ టాప్ టెలిగ్రామ్ వాడేవాళ్లకు సులువు అవుతుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఫీచర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. వాటి గురించి..

ఇకనుంచి టెలిగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను ఇతరులకు కనిపించకుండా బ్లర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ టెలిగ్రామ్ డెస్క్ టాప్ వాడేవాళ్లకు బాగా పనిచేస్తుంది. ‘జీరో స్టోరేజ్ యూసేజ్’ అంటే యాప్ లో వచ్చిన ఫొటోలు, మెసేజ్ లు ఫోన్లో స్టోర్ అవ్వవు. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వదు.

మెసేజింగ్ లో కావాల్సిన విధంగా కలర్స్, ఫాంట్స్, ఫాంట్ సైజ్, టెక్స్ట్ టైప్ ని మార్చుకోవచ్చు. ప్రొఫైల్ పిక్చర్ ని హైడ్ చేయొచ్చు. దీనివల్ల కాంటాక్ట్స్ లో ఫ్రొఫైల్ పిక్చర్స్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదో నిర్ణయించొచ్చు.

గ్రూప్ లో 100 మందికన్నా ఎక్కువ ఉంటే, వాళ్ళ వివరాలు ఇతరులకు కనిపించకుండా అడ్మిన్ హైడ్ చేయొచ్చు. ప్రీమియం తీసుకున్న కస్టమర్ల కోసం 10 యానిమేట్డ్ స్టిక్కర్ ప్యాక్ లను తీసుకొచ్చారు.