సెప్టెంబరు 6న బిగ్ బాస్-4  ప్రారంభం

సెప్టెంబరు 6న బిగ్ బాస్-4  ప్రారంభం

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు పొందిన బిగ్ బాస్ 4వ సీజన్ సెప్టెంబరు 6న ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రీమియర్స్ కు సంబంధించి ఇవాళ(గురువారం,ఆగస్టు-27) సోషల్ మీడియాలో రిలీజైంది. సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్-4 సందడి షురూ కానుంది. ఎన్నడూ చూడని ఎంటర్టైన్ మెంట్, నిజమైన భావోద్వేగాలు అంటూ హోస్ట్ నాగార్జున తాజా ప్రోమోలో తెలిపారు. ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకైతే నందు, అరియానా గ్లోరీ, మహబూబ్ దిల్ సే పేర్లు  వినిపిస్తున్నాయి.