నేటి నుంచి తెలుగు బిగ్‌ బాస్‌- 6 ప్రారంభం

నేటి నుంచి తెలుగు బిగ్‌ బాస్‌- 6 ప్రారంభం

టీవీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ 6 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సీజన్ 3 నుంచీ హీరో నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా 100 పర్సెంట్ ఎంటర్టైన్ మెంట్ ను అందించేందుకు స్మాల్ స్ర్కీన్ పై సందడి చేయబోతున్నారు. ఇక ఈ మోస్ట్ అవేటెడ్‌ రియాల్టీ షో నేటి నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి సభ్యుల లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియోలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, కమెడియన్‌ చంటి, నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప(పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్‌), లేడీ కమెడియన్‌ ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్‌ కూడా ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.