బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో తెలుగు కుర్రాడు

బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో తెలుగు కుర్రాడు
  •     ఈ ఫీట్‌‌ సాధించిన ఫస్ట్‌‌ ఇండియన్‌‌ మెన్స్​ షట్లర్‌‌
  •     సెమీస్‌‌లో లక్ష్యసేన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ

హుయెల్వా (స్పెయిన్‌‌): ఇండియన్‌‌ స్టార్‌‌ షట్లర్‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌.. బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో హిస్టరీ క్రియేట్‌‌ చేశాడు. శనివారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో 12వ సీడ్‌‌ శ్రీకాంత్‌‌ 17–21, 21–14, 21–17తో సహచరుడు లక్ష్యసేన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ సాధించాడు. దీంతో ఈ టోర్నీలో ఫైనల్‌‌ చేరిన తొలి ఇండియన్‌‌ మెన్స్​ షట్లర్‌‌గా రికార్డులకెక్కాడు. ఫలితంగా ఇండియాకు కనీసం సిల్వర్‌‌ మెడల్‌‌నైనా ఖాయం చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న లక్ష్యసేన్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌కు పరిమితమయ్యాడు.  గంటా 9 నిమిషాల పోరాటంలో ఇద్దరు ప్లేయర్లు అద్భుతంగా పోరాడారు. అయితే సరైన సమయంలో తన ఇంటర్నేషనల్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను యూజ్‌‌ చేసిన శ్రీకాంత్‌‌.. డిసైడర్‌‌ గేమ్‌‌లో సూపర్‌‌ షో చూపెట్టాడు. 


ఫస్ట్‌‌ గేమ్‌‌ ఓడినా.. 
ఫస్ట్‌‌ గేమ్‌‌ స్టార్టింగ్‌‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌‌ కోసం గట్టిగానే పోరాడారు. అయితే 2–0తో లీడ్‌‌లో ఉన్న శ్రీకాంత్‌‌ను.. బలమైన స్మాష్‌‌లతో లక్ష్యసేన్‌‌ 2–2, 4–4, 6–6, 8–8తో స్కోర్లను సమం చేశాడు. ఈ దశలో నెట్‌‌ వద్ద మెరుగైన డ్రాప్స్‌‌ వేస్తూ చెలరేగిన లక్ష్య.. తొమ్మిది పాయింట్లు సాధించాడు. మధ్యలో శ్రీ కూడా చాన్స్‌‌ వచ్చినప్పుడల్లా మూడు పాయింట్లతో ముందుకెళ్లాడు. చివరకు 13–16 స్కోరు వద్ద కిడాంబి నాలుగు పాయింట్లు గెలిచి లీడ్‌‌ను 17–16కు పెంచుకున్నాడు. కానీ ఇక్కడే లక్ష్య లాంగ్‌‌ ర్యాలీస్‌‌తో పాటు సూపర్‌‌ రిటర్న్స్‌‌తో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌‌ను సొంతం చేసుకున్నాడు. సెకండ్‌‌ గేమ్‌‌లో శ్రీకాంత్‌‌ డిఫరెంట్‌‌గా ఆడాడు. ఆరంభంలో లక్ష్యసేన్‌‌ పైచేయి సాధించినా.. లాస్ట్‌‌లో కిడాంబి బలమైన రిటర్న్స్‌‌తో చెలరేగిపోయాడు. ఓ దశలో 6–9తో వెనుకబడ్డ శ్రీకాంత్‌‌.. క్రాస్‌‌ కోర్టు విన్నర్స్‌‌తో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి లీడ్‌‌ను 12–9కు పెంచుకున్నాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ స్టేజ్‌‌లో లక్ష్యసేన్‌‌ ఒకటి, రెండు పాయింట్లు నెగ్గినా శ్రీ లీడ్‌‌ను క్రాస్‌‌ చేయలేకపోయాడు. చివరకు 13–12 వద్ద శ్రీకాంత్‌‌ మూడు పాయింట్లు గెలిచి 16–12 ఆధిక్యంలో నిలిచాడు. చివరకు లక్ష్యసేన్‌‌ ఒక్క పాయింట్‌‌ నెగ్గితే శ్రీ.. వరుసగా 5 పాయింట్లు గెలిచి మ్యాచ్‌‌లో నిలిచాడు. కీలకమైన డిసైడర్‌‌ గేమ్‌‌లో ఏడు పాయింట్ల వరకు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తర్వాత శ్రీకాంత్‌‌ క్రమంగా పైచేయి సాధించాడు. రెండు, మూడు, ఒక పాయింట్లతో 13–10 లీడ్‌‌లో నిలిచాడు. పట్టువిడవకుండా పోరాడిన లక్ష్యసేన్‌‌.. నెట్‌‌ వద్ద మెరుగైన డ్రాప్స్‌‌ వేస్తూ 13–13తో స్కోరును ఈక్వల్‌‌ చేశాడు. తర్వాత లక్ష్యసేన్‌‌ రెండు పాయింట్లు సాధిస్తే, శ్రీకాంత్‌‌ నాలుగు పాయింట్లు నెగ్గారు. దీంతో స్కోరు మళ్లీ 15–15, 16–16తో ఈక్వల్‌‌ అయ్యింది. ఈ క్రమంలో   శ్రీకాంత్‌‌ వరుసగా ఐదు పాయింట్లతో గేమ్‌‌ను మ్యాచ్‌‌ను సొంతం చేసుకున్నాడు.