
హైదరాబాద్, వెలుగు: మల్టీ లాంగ్వేజ్కంటెంట్ ఆగ్రిగేటర్ సైట్ రిసోర్సియో తమ ప్లాట్‌ఫారమ్‌పై ఇక నుంచి తెలుగులోనూ కంటెంటును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎడ్-టెక్ స్టార్టప్ న్యూస్, హెల్త్, సాహిత్యం, విద్య, సినిమాల వంటి 50కిపైగా కేటగిరీల్లో ఆడియో, పీపీటీ, పీడీఎఫ్ వంటి ఫార్మాట్లలో కంటెంట్‌ను అందిస్తుంది. మంచి సబ్జెక్ట్ ఉండి బాగా రాయగలిగేవారు తమ ప్లాట్‌ఫారమ్ కోసం పనిచేసి డబ్బులు సంపాదించుకోవచ్చని రిసోర్సియో ఫౌండర్, సీఈఓ గీతికా సుదీప్ చెప్పారు. ప్రారంభించిన ఆరు నెలల్లో 25 లక్షల వ్యూయర్లను సాధించామని చెప్పారు.