హైదరాబాద్, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ 13వ ఓటమి ఖాతాలో వేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 30–37తో హర్యానా స్టీలర్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టులో సంజీవి, ప్రఫుల్ చెరో ఆరు పాయింట్లతో పోరాడారు. స్టీలర్స్ జట్టులో రాహుల్ సేత్‌పాల్ 8 పాయింట్లతో సత్తా చాటాడు. యు ముంబా, పుణెరి పల్టన్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 32–32తో టైగా ముగిసింది.
