మున్నార్​లో మైనస్​ డిగ్రీలకు టెంపరేచర్​

మున్నార్​లో మైనస్​ డిగ్రీలకు టెంపరేచర్​

ఇడుక్కి (కేరళ) : ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కేరళలోని మున్నార్​ హిల్​ స్టేషన్​లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీకి పడిపోయింది. ఇక్కడ టెంపరేచర్లు​ ఇంతలా తగ్గడం చలికాలం సీజన్​ లో ఇదే ఫస్ట్​ టైం. గురువారం తెల్లవారుజామున మున్నార్​ లోని కేటీడీసీ టీ కౌంటీ వద్ద మంచు కురిసింది. ఇలాగే రోజూ ఉదయం కొన్ని వారాలపాటు మంచు కురిస్తే తమ పంట దెబ్బతింటుందని తేయాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్నార్​ పరిసర ప్రాంతాలైన చెందువారా, వట్టవాడలలోనూ చలి తీవ్రత పెరిగింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఆయా ప్రాంతాల ప్రజలను చలి వణికించింది. మున్నార్​, కన్నిమల, చెందువారా, చితువారా, ఎల్లపెట్టి, లక్ష్మి, సెవన్​మల, దేవికులం ప్రాంతాల్లో టెంపరేచర్​ మైనస్​ 1 డిగ్రీలుగా నమోదైంది.