రాజమండ్రిలో 49 డిగ్రీలు.. మలమల మాడుతున్న ఏపీ 

రాజమండ్రిలో 49 డిగ్రీలు.. మలమల మాడుతున్న ఏపీ 

ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతుండటంతో పాటు ఉక్కపోతకు వేడిగాలి కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.రాజమండ్రిలో 49 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.  వృద్దులు, పిల్లలు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికే వడదెబ్బ తగిలి కొంతమంది నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక సతమతమవుతున్నారు.  విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు అత్యధికంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం... 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 131 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, కృష్ణా జిల్లా కోడూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొన్నూరులో 45.9, ఆగిరిపల్లెలో 45.7, గోపాలపురంలో 45.4, గుంటూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

విశాఖ జిల్లాలో కూడా... 

విశాఖపట్నం జిల్లాలో  కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తకోటలో 40.23, నాతవరం 40.22, మునగపాక 40.17, కశింకోట 40.14, బలిఘట్టం 40.12, మాడుగుల 40.05, గంభీరం 40.01 డిగ్రీలు.. శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు 43, రాజాం 42, పాలకొండలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లాలో గరిష్టంగా 37.5 డిగ్రీలు, ప్రకాశంలో 36, తిరుపతిలో 41, చిత్తూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
మరో ఐదు రోజులు 

మరో ఐదు రోజుల పాటు విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో  42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవ్వనుందని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.