కాగజ్ నగర్లో కొట్టుకుపోయిన వంతెన.. 50 గ్రామాలకు రాకపోకలు బంద్

 కాగజ్ నగర్లో కొట్టుకుపోయిన వంతెన.. 50 గ్రామాలకు రాకపోకలు బంద్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం అందేవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కా లిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో కా గజ్ నగర్, ద హేగాం మండలాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. 

కాగా రెండేళ్ల క్రితం ఇక్కడ ఉన్న శాశ్వత బ్రిడ్జి కుంగిపోవ డంతో దానికి మరమ్మతులు చేస్తున్నారు. దీంతో గత సంవత్సర కాలంగా తాత్కా లిక వంతెన పై నుంచి రాకపోకలు సా గుతున్నాయి. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో తాత్కాలిక బ్రిడ్జ్ కొ ట్టుకుపోయింది. కాంట్రాక్టర్ కి ఆర్ అండ్ నుంచి నిధులు రాకపోవడం తోనే పనుల్లో జాప్యం జరిగి.. ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.