రూ.700 కడితే పది సినిమాలు..పీవీఆర్​ ఐనాక్స్​లో సబ్​స్క్రిప్షన్​

రూ.700 కడితే పది సినిమాలు..పీవీఆర్​ ఐనాక్స్​లో సబ్​స్క్రిప్షన్​

న్యూఢిల్లీ: సినిమా చైన్ పీవీఆర్​ ఐనాక్స్​ లిమిటెడ్ "పీవీఆర్​ ఐనాక్స్​ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్" పేరుతో చందా విధానాన్ని ప్రకటించింది. ఈ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పాస్ ఈ నెల 16 నుంచి అందుబాటులో ఉంటుంది.  రూ.700 చెల్లించి నెలవారీ దీనిని తీసుకుంటే నెలకు పది సినిమాలు చూడొచ్చు. ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది. ఈ ఆఫర్​ ఐమాక్స్​,  గోల్డ్, లక్స్,  డైరెక్టర్స్ కట్ సినిమాలకు వర్తించదని ఐవీఆర్​ ఐనాక్స్​ లిమిటెడ్​ కో–సీఈఓ గౌతమ్ దత్తా అన్నారు. 

ప్రేక్షకులు థియేటర్​కు వచ్చి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ప్రతి వారం రావడం ఖర్చుతో కూడుకున్నదని అని చెబుతున్నారని అన్నారు. అందుకే సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పాస్ విధానం తెచ్చామని అన్నారు. ప్రేక్షకుల సంఖ్య తగ్గడం సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా మధ్య స్థాయి,  చిన్న బడ్జెట్ చిత్రాలకు మంచిది కాదని దత్తా అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు దూరమవుతున్నాయని, మనం వాటిని తిరిగి సినిమాల్లోకి తీసుకురావాలని చెప్పారు.

 ‘‘థియేటర్​ క్యాంటీన్ల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కంప్లెయింట్లు వచ్చాయి. అందుకే ధరలను 40 శాతం తగ్గించాం.  కొత్త తరహా స్నాక్స్​ను అందుబాటులోకి తెస్తున్నాం. సినిమా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ప్లాన్ వల్ల మరింత మందికి దగ్గర అవుతామని భావిస్తున్నాం” అని దత్తా వివరించారు. పీవీఆర్​ యాప్ లేదా వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ నుంచి కనీసం మూడు నెలల కాలానికి 'ఐవీఆర్​ ఐనాక్స్​ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు. టికెట్ల బుకింగ్​ సమయంలో పేమెంట్​ విధానంగా పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ కూపన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకోవాలి.