ఇప్పటిదాకా సీఆర్పీఎఫ్‌‌‌‌లో 10 వేల మందికి కరోనా

ఇప్పటిదాకా సీఆర్పీఎఫ్‌‌‌‌లో 10 వేల మందికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా మొదలైన నాటి నుంచి దాదాపు 10 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది దీని బారిన పడ్డారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరీ గురువారం మీడియాకు తెలిపారు. వరుసగా సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. మొత్తం 3.5 లక్షల మంది సిబ్బందిలో 10 వేల మందికి కరోనా సోకిందని చెప్పారు. అయినప్పటికీ సీఆర్ఫీఎఫ్ జవాన్లు ఎంతో ధైర్యంగా డ్యూటీ చేస్తున్నారన్నారు. మహమ్మారి మొదలైన నాటి నుంచి సేప్టీ మెజర్స్ తీసుకుంటున్నామని…ఇమ్యూనిటీ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా సోకిన వారిలో 85 శాతం జవాన్లు రికవరీ అయి మళ్లీ డ్యూటీలో చేరటం సంతోషంగా ఉందన్నారు.

For More News..

తెలంగాణలో మరో 2,009 కరోనా కేసులు

కరోనా టైంలో కోటి చీరలు నేసిన నేతన్నలు

లీడర్లూ టెస్టులు చేయించుకోండి క్యాంపుకెళ్లాలె