ఏప్రిల్ మూడో వారంలో టెనెంట్‌‌ మూవీ

ఏప్రిల్ మూడో వారంలో టెనెంట్‌‌ మూవీ

ఇటీవల ‘పొలిమేర 2’లో లీడ్‌‌ రోల్‌‌తో  ఆకట్టుకున్న సత్యం రాజేష్‌‌.. ‘టెనెంట్‌‌’ అనే మరో డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వై.యుగంధర్‌‌‌‌ దర్శకత్వంలో మొగుళ్ల చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ప్రజెంట్ జనరేషన్‌‌లో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే విలువైన కంటెంట్‌‌తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, సమ్మర్‌‌‌‌ స్పెషల్‌‌గా ఏప్రిల్‌‌ చివరి వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.  మేఘా చౌదరి, భ‌‌ర‌‌త్‌‌కాంత్‌‌, చంద‌‌న‌‌, ఎస్తేర్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఎన్ రవీందర్ రెడ్డి సహ నిర్మాత. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు.