10th Paper Leak : టెన్త్ క్లాస్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు కాదు.. మిగతావన్నీ యథాతథం  

10th Paper Leak : టెన్త్ క్లాస్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు కాదు.. మిగతావన్నీ యథాతథం  

వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ కావడంతో రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. రేపటి ఎగ్జామ్ యథావిథిగా సాగుతుందా..? ఈ రోజు రాసిన ఎగ్జామ్ వ్యాలిడ్ అవుతుందా...? అన్న ప్రశ్నలు విద్యార్థులను సతమతమవుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన నిమిషాల్లోనే వాట్సాపుల్లో లీకైన క్వశ్చన్ పేపర్.. కేవలం మీడియా గ్రూపుల్లో మాత్రమే షేర్ అయింది. నిందితుడు బందప్ప పలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా.. అప్పటికే ఎగ్జామ్ ప్రారంభం కావడంతో ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ పరీక్ష ప్రారంభానికి ముందే ఈ ఘటన జరిగితే విద్యార్థులు బయపడినట్టుగానే.. ఎగ్జామ్ ను రద్దు చేయడం లాంటి ఘటనల్ని ఊహించొచ్చు. కానీ అలాంటివేం జరగలేదు. విద్యార్థులు పరీక్షా హాలులోకి వెళ్లిన తర్వాతే పేపర్ లీకైంది. అంటే క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క విద్యార్థికీ చేరలేదు.

పరీక్ష ప్రశ్నా పత్రాన్న్ని వాట్సాప్ గ్రూపుల్లో బందప్ప షేర్ చేసినప్పటికీ.. అవి విద్యార్థులకు చేరనందున రేపటి ఎగ్జామ్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. యథావిథిగానే మిగతా ఎగ్జామ్ ను కండక్ట్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ రోజు రాసిన ఎగ్జామ్ కూడా వ్యాలిడ్ అవుతుందని విద్యార్థులు గమనించాలి.