షర్మిల పాదయాత్రలో బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు

షర్మిల పాదయాత్రలో బస్సును తగలబెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. నర్సంపేట్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో  లంచ్ బ్రేక్ లో కాన్వాయ్ లోని  బస్ ను టీఆర్ఎస్ అనుచరులు తగలబెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు.  పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.

MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్ లోని ఒక బస్సుకు నిప్పు పెట్టారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని  అటు వైఎస్సార్ టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.