జమ్మూలో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్

జమ్మూలో ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన  ఉగ్రదాడిలో పారామిలటరీ అధికారి ఒకరు మృతి చెందారు. గంగూ క్రాసింగ్ వద్దనున్న చెక్ పోస్ట్  పరిసరాల యాపిల్ తోటల నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ దాడిలో గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాడి జరిగిన వెంటనే బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. ఉగ్రవాదుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మంగళవారం శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలోని పోలీసు చెక్ పాయింట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో జమ్మూ కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ముస్తాక్ అహ్మద్ మరణించగా, మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.గత ఆరు నెలల్లో భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు.