కోర్టుకెళ్తామన్న ట్విట్టర్.. మస్క్ ఫన్నీ రిప్లై

కోర్టుకెళ్తామన్న ట్విట్టర్.. మస్క్ ఫన్నీ రిప్లై

ట్విట్టర్ తో కుదుర్చుకున్న 44బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించడంపై ఆ కంపెనీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదా పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఎలన్ మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ట్విట్టర్ పై సటైరికల్ ట్వీట్ చేశారు.

మస్క్ తను పోస్ట్ చేసిన ఇమేజ్ లోని మొదటి గ్రిడ్ లో నవ్వుతున్న ఫొటో పెట్టి పక్కనే 'వాళ్లు నేను ట్విట్టర్ కొనలేనని అన్నారు' అన్న వాక్యం పెట్టాడు. సెకండ్ గ్రిడ్ లో కూడా ఇంకాస్త గట్టిగా నవ్వుతున్న ఇమేజ్ పక్కనే  'తర్వాత బాట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరన్నరు' అని రాసిం ఉంది. థర్డ్ గ్రిడ్ లో 'ఇప్పుడు కోర్టుకెళ్లి నాతో బలవంతంగా ట్విట్టర్ కొనిపిస్తానంటున్నారు'. ఇక ఫోర్త్ గ్రిడ్ లో మస్క్ పగలబడి నవ్వుతున్న ఫొటో పక్కన 'బోట్ సమాచారాన్ని కోర్టులో బహిర్గతంలో చేయాల్సి ఉంటుంద' అనే వాక్యం పెట్టారు. ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న ఎలన్ మస్క్ ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ట్విట్టర్ ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మస్క్ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు రద్దు అంశంపై ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టైలర్ స్పందించారు. నిర్ణయించిన ధరకు ట్విట్టర్ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు బోర్డు కట్టుబడి ఉందని చెప్పారు. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.