కొత్త ఏడాదైనా ప్రపంచ కప్ కల నెరవేరేనా..? 2024లో టీమిండియా పూర్తి షెడ్యూల్

కొత్త ఏడాదైనా ప్రపంచ కప్ కల నెరవేరేనా..? 2024లో టీమిండియా పూర్తి షెడ్యూల్

మరికొన్ని గంటల్లో పాత ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ తరుణంలో మన జట్టు ప్రదర్శన ఈ ఏడాది ఎలా సాగింది. ఏంటి..? అనేది ముందుగా తెలుసుకుందాం. 2023 భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని విజయాలు అందుకున్న టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లోనూ అదే జోరు కనబరిచింది. కాకపోతే ఆఖరి మెట్టుపై బోల్తాపడి టైటిళ్లను చేజార్చుకుంది.

రెండు సార్లు ఆస్ట్రేలియానే..

జూన్‌లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. నవంబర్‌లో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలోనే పరాజయం పాలైంది. ఇవి చేజార్చుకున్న రెండు ఐసీసీ టైటిళ్లు. 

ఇక 2024 విషయానికొస్తే.. కొత్త ఏడాదిలోనూ తీరికలేని షెడ్యూల్ ఉంది. ఒక సిరీస్ ముగిసేలోపు మరో సిరీస్‌కు సన్నద్ధమవ్వాల్సిందే. అందునా ఏడాది మద్యలో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జరగనుంది.  

 

2024లో భారత జట్టు షెడ్యూల్

  • డిసెంబర్ 10- జనవరి 7: సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్
  • జనవరి 11- జనవరి 17 : స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్ ల టీ20ల సిరీస్
  • జనవరి 25 - మార్చి 11: సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్‌ సిరీస్
  • మార్చి-మే: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)
  • జూన్ 4 - జూన్ 30: టీ20 ప్రపంచ కప్ 2024(వెస్టిండీస్, అమెరికా)
  • జూలై: లంక గడ్డపై లంకేయులతో మూడు వన్డేలు, మూడు టీ20లు
  • సెప్టెంబర్ 2024: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు
  • అక్టోబర్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల టెస్ట్‌ సిరీస్
  • నవంబర్-డిసెంబర్: ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు మ్యాచ్ ల టెస్ట్‌ సిరీస్