
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్) ప్రిలిమినరీ కీ రిలీజైంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5గంటల వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా సమర్పించవచ్చని టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. కాగా, గతనెల జూన్ 18 నుంచి ప్రారంభమైన ఎగ్జామ్స్ 30తో ముగిశాయి. టెట్ పేపర్–1కు 47,224 (74.65%) మంది, పేపర్–2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరీలో 48,998 (73.48%), సోషల్ స్టడీస్‌లో 41,207 (76.73%) మంది అటెండ్ అయ్యారు.