
హైదరాబాద్, వెలుగు: టీజీఈసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి అయింది. ఇంజినీరింగ్ లో 80.27% సీట్లు, ఫార్మసీలో 4.42% సీట్లు నిండాయి. ఈ మేరకుల శనివారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 168 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 12,618 సీట్లున్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 13,001 మంది హాజరుకాగా, వారిలో 10,129 మందికి సీట్లు అలాట్ అయ్యాయి.
ఫార్మసీలో 1,287 సీట్లుంటే 57 నిండాయి. సీట్లు పొందిన అభ్యర్థులు 22లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. సీఎస్ఈలో 4,050 సీట్లుంటే 3,175 మందికి, సీఎస్ఈ ఏఐఎంఎల్ లో 1,937 సీట్లుంటే 1,346, సీఎస్ఈ డేటాసైన్స్ లో 1,174 సీట్లుంటే 7,74 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈలో 1,712 సీట్లుంటే 1,672, ఈఈఈలో 877 సీట్లుంటే 877 సీట్లు నిండాయి. మెకానికల్ ఇంజినీరింగ్ లో 639 సీట్లకు 576, సివిల్ ఇంజినీరింగ్ లో 574 సీట్లకు 563 సీట్లు, బీఫార్మసీలో 1,287 సీట్లకు 57 నిండాయి.