పీసీబీలో నాగేశ్వర్రావు సేవలు మరవలేనివి

పీసీబీలో నాగేశ్వర్రావు సేవలు మరవలేనివి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) జాయింట్ చీఫ్ ఎన్విరాన్​మెంటల్ సైంటిస్ట్‌ డి.నాగేశ్వర్ రావు బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పీసీబీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్య కార్యదర్శి జి.రవి మాట్లాడుతూ.. నాగేశ్వర్ రావు చేసిన సేవలను కొనియాడారు. శాస్త్రవేత్తగా తన పదవీకాలంలో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సంస్థకు 35 ఏండ్లు అంకితభావంతో చేసిన సేవలను ప్రశంసించారు. తనకు సహకరించినందుకు అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది, అధికారులు ఆయనను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. చీఫ్ ఇంజనీర్ బి. రఘు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.