
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం శనివారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభు నరసింహస్వామిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శనం కల్పించారు.
అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఇంఛార్జ్ ఈవో రవినాయక్ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గణేష్ నాయక్, సీఐ భాస్కర్ తదితరులు ఉన్నారు.