టీజీయూజీ సెట్‌‌‌‌– డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​

టీజీయూజీ సెట్‌‌‌‌– డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​

రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు టీజీయూజీసెట్‌‌‌‌- నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ.

అర్హత: ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 పరీక్షలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతేనే ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటారు. టీస్‌‌‌‌ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 23, టీఎస్‌‌‌‌ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 15 మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 7 పురుషుల రెసిడెన్షియల్‌‌‌‌ కళాశాలలు నిర్వహిస్తున్నారు.

సెలెక్షన్​: అభ్యర్థి ఇంటర్మీడియట్‌‌‌‌లో చదివిన సబ్జెక్టుల ప్రకారం ప్రకటనలో పేర్కొన్న ఐదు టెస్టుల స్ట్రీమ్‌‌‌‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్​ విధానంలో మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష మార్చి 5న నిర్వహిస్తారు. వివరాలకు www.tswreis.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.