కోలీవుడ్ దిగ్గజాలు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. మరి అలాంటిది వారిలో ఒకరు నటిస్తుంటే.. మరొకరు సినిమాను నిర్మిస్తే? ఫ్యాన్స్ కు పూనకాలే. ఈ ఇద్దరు కాంబినేషన్ ను సెట్ చేస్తూ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'తలైవర్ 173'. లేటెస్ట్ గా ఈ క్రేజీ ప్రాజెక్టుకు 'ధర్మన్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "ధర్మం వర్ధిల్లుతుంది" అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
'డెడ్లీ డాక్టర్'గా తలైవర్..
ఈ మూవీలో రజనీకాంత్ లుక్ సరికొత్తగా ఉండబోతుంది. ఇప్పటివరకు తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తలైవర్ ఎప్పుడూ లాయర్, పోలీస్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో మెప్పించారు. కానీ.. తొలిసారి ఒక డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనిపై దర్శకుడు అశ్వత్ మారిముత్తు క్లారిటీ ఇస్తూ .. ఇది తమిళనాడుకు చెందిన ఫేమస్ 'రూ. 5 డాక్టర్' బయోపిక్ కాదు. ఇందులో రజనీ ఫుల్ స్వాగ్, స్టైల్, అల్టిమేట్ మాస్ అప్పీల్‌తో అలరించే ఒక డెడ్లీ డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇదొక హై-వోల్టేజ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ థ్రిల్లర్. నాకు రజనీ సార్ 'పడయప్ప', కమల్ సార్ 'వేట్టైయాడు విళైయాడు' అంటే ప్రాణం.. ఆ రెండింటి కలయికలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
தர்மமே வெல்லும்!#Dharman #Thalaivar173 #SuperstarRajinikanth @rajinikanth #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/9ghF9XgboI
— Kamal Haasan (@ikamalhaasan) June 24, 2026
క్రేజీ కాంబినేషన్స్..
ఈ మూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), టర్మెరిక్ మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కోలీవుడ్ బెస్ట్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ రంగంలోకి దిగారు. గ్లామరస్ బ్యూటీస్ రాశీ ఖన్నా, సీనియర్ నటి సిమ్రాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
►ALSO READ | ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ సాగే వసుదేవసుతం మూవీ...
ఈ 'ధర్మన్' మూవీ.. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. రజినీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా, కమల్ మార్క్ క్వాలిటీతో రాబోతున్న ఈ 'ధర్మన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
