
నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్(Kajal agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.. లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా నటిస్తోంది. ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
- ALSO READ | సలార్ రాకతో.. బడా సినిమాలకు పోటీగా సైంధవ్..?
ఇక తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట అక్టోబర్ 4న రానుంది. ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఉయ్యాలో.. ఉయ్యాల అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలసుబ్యమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ పాడినట్టు తెలిపారు తమన్. ఇక పోస్ట్ లో తమన్.. చరణ్ అన్నా మీ గొంతులో నాన్న వినిపించారు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తమన్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.