సలార్ రాకతో.. బడా సినిమాలకు పోటీగా సైంధవ్‌..?

సలార్ రాకతో.. బడా సినిమాలకు పోటీగా సైంధవ్‌..?

విక్టరీ వెంకటేష్‌( Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్‌ కొలను(Sailesh Kolanu) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ సైంధవ్‌(Saindhav). శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటుస్తున్న ఈ మూవీలో రుహానీ శర్మ, ఆండ్రియా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీని 2023 డిసెంబరు 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడిదే తేదీకి ప్రశాంత్ నీల్ సలార్‌(Salaar Part1 ) బరిలో దిగడం ఖాయమవడంతో.. ప్రభాస్ కు పోటీగా నిలువడం సరికాదనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం.అందుకోసం మరో కొత్త రిలీజ్ డేట్ ని ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

దీంతో సైంధవ్‌ మూవీని 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. సైంధవ్‌ మూవీని చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఇది వెంకటేష్‌కు 75వ సినిమా అలాగే శైలేష్ కొలను ఫస్ట్ టైం భారీ బడ్జెట్‌తో తీస్తున్న మూవీ కావడం విశేషం.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా..సంతోష్‌ నారాయణ్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. సైంధవ్‌ ను తెలుగు, హిందీ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

ఇప్పటికే సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం,నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్, ప్రశాంత్ నీల్ హను మాన్, రజనీ లాల్ సలామ్ మూవీస్ బరిలో ఉన్నాయి. దీంతో సైంధవ్‌ మూవీ కూడా సంక్రాంతి రేసులో చేరటం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.