తమన్నా దేవత.. ఇది కొంచం ఎక్కువగా అనిపించడంలేదా బ్రో?

తమన్నా దేవత.. ఇది కొంచం ఎక్కువగా అనిపించడంలేదా బ్రో?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), తమన్నా(Thamannaah) జంటగా వస్తున్న జైలర్(Jailer) మూవీ నుండి తాజాగా "కావాలా" అనే సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో తమన్నా గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మునుపెన్నడూ లేని విదంగా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఇక తాజాగా ఈ సాంగ్ పై తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay varma) స్పందించారు. ఈమేరకు తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు.. "కావాలా పాట ఫైర్ పుట్టిస్తోంది. సినిమా దేవుడు రజినీకాంత్, దేవత తమన్నా" అని రాసుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పోస్టు చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో స్పందిస్తున్నారు. ఎంత ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం మరీ దేవతతో పోల్చాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా దేవుడు రజినీకాంత్ ఓకే కానీ, దేవతగా తమన్నాని పోల్చడం కొంచం ఎక్కువగా అనిపించడంలేదా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.