కౌలు రైతులను గుర్తించేందుకు విధివిధానాలు రూపొందించాలె: తమ్మినేని వీరభద్రం

కౌలు రైతులను గుర్తించేందుకు విధివిధానాలు రూపొందించాలె: తమ్మినేని వీరభద్రం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా  రైతుబంధు చెల్లిస్తామని సర్కారు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే, వారిని గుర్తించేందుకు విధివిధానాలు కూడా వెంటనే రూపొందించడం అవసరమని ఒక ప్రకటనలో చెప్పారు. సాగుచేయని, పడావుపడిన భూములకు, రియల్‌‌ ఎస్టేట్‌‌ భూములకు రైతుబంధు ఇవ్వబోమని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. రుణమాఫీ, మద్దతు ధరల నిర్ణయానికి తగిన విధివిధానాలు త్వరగా రూపొందించాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలుకు రూ.53వేల కోట్లు కేటాయించారని, ప్రభుత్వ ప్రతిపాదనలు సానుకుల దిశలో ఉన్నాయన్నారు.