అధ్యక్ష ఎన్నికల అవినీతిపై ప్రశ్న.. మైక్ పడేసి ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన ట్రంప్

అధ్యక్ష ఎన్నికల అవినీతిపై ప్రశ్న.. మైక్ పడేసి ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఎప్పుడు కోప్పడతారో.. ఎప్పుడు కామెడీ చేస్తారో అర్థం కాని పరిస్థితి. అయితే ఆదివారం (జూన్ 7) న జరిగిన ఓ ఇంటర్వ్యూలో మైక్ పడేసి వెళ్లిపోవడం వైరల్ గా మారింది. 

అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ NBC మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాడరేటర్ క్రిస్టెన్ వెకర్ అడిగి ప్రశ్నలకు తటపటాయించిన ట్రంప్.. సమాధానం చెప్పలేక మైక్ పడేసి మధ్యలోనే ఇంటర్వ్యూ వదిలి వెళ్లిపోయారు. 

2020 అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి జరిగిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వెకర్ అడిగారు. పదే పదే ఆరోపిస్తున్నట్లు కాదు.. ఆధారాలు బయట పెట్టాలని గట్టిగా అడిగే సరికి చిర్రెత్తుకొచ్చిన ట్రంప్.. థ్యాంక్యూ డార్లింగ్ అంటూ లేచి వెళ్లిపోయారు. 

ఎవిడెన్స్ కావాలా..? రియల్లీ.. ఆధారాలు ఇస్తే ప్లే చేస్తారా..? నువ్వు మోసగత్తెవైనా అయి ఉండాలి.. లేదా స్టుపిడ్ అయినా అయ్యుండాలంటూ లేచి వెళ్లిపోయారు. పక్షపాత వైఖరిలో ప్రశ్నలు అడుగుతున్నావని ట్రంప్ అనటాన్ని ఆమె తిరస్కరించడంతో ట్రంప్ ఈ విధంగా నిందించారు. 

వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే మైక్రో ఫోన్ తీసేసి బయటికి వెళ్లే ముందు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెకర్ బయాస్డ్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారని.. అమెరికన్ మీడియాకు నిజాయితీ లేదని నిందించారు. 

బైడెన్ ప్రభుత్వ హయాంలో తాము టార్గెట్ కు గురైనట్లు ఆరోపిస్తున్న ప్రజలకు పరిహారం ఇచ్చేందుకు తీసుకొచ్చిన యాంటీ వెపనైజేషన్ ఫండ్ గురించి మొదలైన ఇంటర్వ్యూ వాడీవేడీగా సాగుతూ.. చివరికి ట్రంప్ ఆగ్రహంతో ముగిసింది. ఈ బిల్లు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడం కుదరదని అమెరికా న్యాయ శాఖ చెప్పడంతో ఆగిపోయింది.