RashmikaVijay: రష్మిక ఎంగేజ్‌మెంట్ సీక్రెట్ లీక్! జగపతి బాబు షోలో 'విజయ్' ప్రస్తావన వైరల్!

RashmikaVijay: రష్మిక ఎంగేజ్‌మెంట్ సీక్రెట్ లీక్! జగపతి బాబు షోలో 'విజయ్' ప్రస్తావన వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  లేటెస్ట్ గా ఈ బ్యూటీ నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న  'జయంబు నిశ్చయంబురా' టాక్ షో లో పాల్గొంది. అయితే ఈ షోలో ఆమె వేలికి ఉన్న నిశ్చితార్థపు రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రింగ్ పై రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

 జగపతి బాబు ప్రశ్నలకు రష్మిక సిగ్గు! 

ఈ టాక్ షోలో స్పెషల్ లుక్ లో మెరిసిన రష్మిక.. ఆడియెన్స్‌కు తన ట్రేడ్‌మార్క్ కొరియన్ హార్ట్స్ చూపించినప్పుడు ఆమె వేలికి ఉన్న రింగ్ హైలైట్ అయింది. రష్మిక జీవితంలో 'విజయ్' అనే పేరు ప్రస్తావన గురించి జగపతి బాబు సరదాగా అడిగారు. 'విజయ్ దేవరకొండతో ఫ్రెండ్‌షిప్, విజయ్ సేతుపతికి ఫ్యాన్, తళపతి విజయ్కి ఆల్ టైమ్ ఫ్యాన్... సో, నువ్వు 'విజయం'ని, 'విజయ్'ని సొంతం చేసుకున్నావు అనుకుంటా అని జగపతి బాబు చమత్కరించారు. దీనికి రష్మిక బిగ్గరగా నవ్వతూ.. అల్లరిగా కన్నుగీటుతూ సమాధానం ఇచ్చింది..

ఎంగేజ్‌మెంట్ నిజమేనా?

అనంతరం.. జగపతిబాబు రష్మిక వేలిపై ఉన్న రింగులను గమనించి.. 'ఈ రింగులు సెంటిమెంటల్‌వా? లేక...' అని సూటిగా ప్రశ్నించారు. దానికి రష్మిక సిగ్గుపడుతూ.. 'ఇవి చాలా ముఖ్యమైన రింగులు' అని జవాబిచ్చారు. దీంతో జగపతి బాబు 'ఖచ్చితంగా వాటిలో ఒకటి నీకు చాలా ఇష్టమైనది అయ్యి ఉంటుంది. దాని వెనుక ఒక కథ ఉండి ఉంటుంది' అని అన్నారు. దీంతో ప్రేక్షకులు చప్పట్లతో ఆమెను ప్రోత్సహించగా..  రష్మిక నవ్వుతూ 'నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అని బదులిచ్చారు.

 

దీంతో హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ షోలో రష్మిక సమాధానాలు దాటవేసినప్పటికీ.. జీ5 అధికారిక సోషల్ మీడియా పేజీ సైతం ఈ క్లిప్‌ను పోస్ట్ చేస్తూ, అల్లు అర్జున్ మీమ్‌ను జతచేసి.. 'ఆ రింగ్ ఎవరిచ్చారో చెప్పండయ్యా' అని జోక్ చేసింది. ఈ పోస్ట్‌కు అభిమానులు 'కొండన్న రింగ్ ఒకటి, లక్కీ రింగ్ ఒకటి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

నిజానికి గత నెల అక్టోబరులో హైదరాబాద్‌లో రష్మిక, విజయ్ దేవరకొండలు అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఈ జంట అధికారికంగా ప్రకటించకపోయినా, విజయ్ దేవరకొండ టీమ్ మాత్రం ఈ నిశ్చితార్థాన్ని ధృవీకరించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాక, వీరి పెళ్లి ఫిబ్రవరి 2026 లో జరగనుందని కూడా టాక్ వినిపిస్తోంది. 'గీత గోవిందం' , 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో కలిసి నటించినప్పటి నుండి ఈ జంట ప్రేమాయణం గురించి రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. లేటెస్ట్ గా జగపతి బాబు షోలో రష్మిక రింగ్ ఫ్లాంటింగ్, ఆమె రియాక్షన్స్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.  ఇప్పుడు వారి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.