బడ్జెట్ పై ఒక్కో రంగానిది ఒక్కో డిమాండ్

బడ్జెట్ పై ఒక్కో రంగానిది ఒక్కో డిమాండ్

న్యూఢిల్లీమరొక్క రోజులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2021 ప్రజల ముందుకు రాబోతుంది. కరోనా తర్వాత వస్తోన్న ఈ బడ్జెట్‌‌‌‌పై ఇండియన్ రియల్ ఎస్టేట్‌‌‌‌కు, ఆటోకు, హెల్త్ కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు పెద్ద ఎత్తునే ఆశలు, అంచనాలున్నాయి. వైరస్‌‌‌‌ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఈ రంగాలకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌‌‌‌లో చేయూతను అందిస్తుందని ఎనలిస్ట్‌‌‌‌లు భావిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ కోరుకునేవి ఇవే…

హోమ్ లోన్ వడ్డీ రేటుపై ఎక్కువ రిబేట్….

కన్జంప్షన్‌‌‌‌ పెంచేందుకు రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రస్తుతమున్న ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ విధానాన్ని  మార్చాలని కోరుకుంటున్నారు. ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 24 కింద, ప్రస్తుతం ఇండ్ల కొనుగోలుదారులు హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షల వరకు రిబేట్‌‌‌‌కు అర్హులు. ఈ రిబేట్‌‌‌‌ను కేంద్రం కనీసం రూ.5 లక్షలకు పెంచి, హౌసింగ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను మరింత పెంచాలని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఛైర్మన్ అనూజ్ పురి చెప్పారు.

డెవలపర్లకు జీఎస్టీ డిస్కౌంట్…

కరోనా వైరస్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ను బాగా దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో అమ్ముడుపోని ఇన్వెంటరీల కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా బడ్జెట్‌‌‌‌లో పరిమిత కాల వ్యవధిలో జీఎస్టీ మినహాయింపును ఇవ్వాలని డెవలపర్లు కోరుతున్నారు. జీఎస్టీ మినహాయింపులతో పాటు ఇండ్ల కొనుగోలుదారులకు ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ త్వరగా కోలుకుంటుందంటున్నారు.

క్యాపిటల్ ఫ్లో…

లిక్విడిటీ కొరత అనేది డెవలపర్లను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది. క్యాష్ కొరతతో ప్రాజెక్ట్‌‌‌‌లు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాపిటల్ ఫ్లో కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డెవలపర్లు కోరుతున్నారు. సప్లయి పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలను కాస్త పరిమితం చేయొచ్చని పురి చెప్పారు.

సింగిల్ విండో క్లియరెన్స్…

సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఎంతో కాలంగా రియల్ ఎస్టేట్ కోరుతోన్న డిమాండ్. ప్రాజెక్ట్‌‌‌‌లకు పర్మిషన్లు పొందేందుకు చాలా సమయం పడుతుండటంతో.. డెవలపర్లకు భారీగా ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. అంతేకాక ఇండ్ల కొనుగోలుదారులకు తలనొప్పిగా మారుతుంది.  దీంతో నిర్దేశించిన సమయంలోపల ప్రాజెక్ట్‌‌‌‌ను డెవలప్ చేసేలా పరిమిత అప్రూవల్స్‌‌‌‌ను తీసుకురావాలని కోరుతున్నారు.

అఫర్డబుల్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌లోకి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు..

2030 నాటికి ఇండియా అర్బన్ పాపులేషన్ 59 కోట్లకు పెరుగుతుందని అంచనా ఉంది. పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు అవసరం. ఈ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు ప్రైవేట్ రంగం నుంచి రావాల్సి ఉందని డెవలపర్లు అంటున్నారు. రాష్ట్ర రాజధానుల్లోకి, టైర్ 2, 3 నగరాల్లోకి ప్రైవేట్ రంగ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ప్రభుత్వం ప్రోత్సహించాలి.

ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌ ఆశలివే

రానున్న బడ్జెట్‌‌‌‌పై ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఈజ్‌‌‌‌ ఆఫ్ డూయింగ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ను మెరుగుపరచడం, స్క్రాపేజి పాలసీని అమలు చేయడం, దిగుమతి చేసుకుంటున్న వెహికల్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌లపై కస్టమ్‌‌‌‌ డ్యూటీలను తగ్గించడం వంటివి రానున్న బడ్జెట్‌‌‌‌లో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించేందుకు  ల్యాండ్‌‌‌‌, లేబర్‌‌‌‌‌‌‌‌, లిక్విడిటీలకు సంబంధించిన రీఫార్మ్స్‌‌‌‌ ప్రభుత్వం తీసుకొస్తుందని టయోటా కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌ అంచనావేస్తోంది పొల్యూషన్‌‌‌‌, పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ వినియోగాన్ని తగ్గించి కొత్త వెహికల్స్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకొస్తుందని పేర్కొంది. బడ్జెట్‌‌‌‌లో లగ్జరీ కార్లపై 28% జీఎస్టీని విధిస్తున్నారు. దీన్ని తగ్గిస్తారని ఈ కార్ల సెగ్మెంట్‌‌‌‌ అంచనావేస్తోంది. వర్కింగ్ క్యాపిటల్‌‌‌‌లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రామెటీరియల్స్‌‌‌‌పై విధిస్తున్న జీఎస్‌‌‌‌టీని తగ్గించాలని ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ మాన్యుఫాక్చరర్లు కోరుతున్నారు. క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్‌‌‌‌‌‌‌‌, రీసెర్చ్‌‌‌‌, డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి ఇన్వెర్టెడ్‌‌‌‌ డ్యూటీలను రీఫండ్‌‌‌‌ చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం రామెటీరియల్స్‌‌‌‌పై 18 శాతం జీఎస్‌‌‌‌టీని, సప్లయ్‌‌‌‌పై 5%  జీఎస్‌‌‌‌టీని విధిస్తున్నారని ఒకినవా ఆటోటెక్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ జీతెందర్‌‌‌‌‌‌‌‌ శర్మ అన్నారు. దీంతో మాన్యుఫాక్చరర్లపై ఇన్వెర్టెడ్‌‌‌‌ డ్యూటీ పడుతోందని చెప్పారు. ఈ ట్యాక్స్ ఫ్రేమ్‌‌‌‌ వర్క్‌‌‌‌ను ప్రభుత్వం ఇంకోసారి పరిశీలించాలని కోరారు.

హెల్త్‌‌‌‌‌‌‌‌పై ఖర్చులు పెంచాలి..

రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఖర్చులు పెంచాలని ఈ ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం జీడీపీలో 1.2 శాతాన్ని హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్ , వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయిస్తున్నారని మణిపాల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ దిలిప్‌‌‌‌‌‌‌‌ జోస్‌‌‌‌‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ కేటాయింపులను 2.5 శాతానికి పెంచాలని, దీనికి రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనే మొదటి అడుగు పడాలని చెప్పారు. పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం హెల్త్, వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌టీని పే చేస్తోంది. రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ తగ్గించే చర్యలుంటాయని ఈ ఇండస్ట్రీ అంచనావేస్తోంది. ఈ సెక్టార్లో గత 9–10 నెలల్లో చాలా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, వెంచర్లు ఏర్పడ్డాయి. వీటి డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ హాలిడేస్‌‌‌‌‌‌‌‌ను ఈ ఇండస్ట్రీ కోరుకుంటోంది. వర్క్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌లో వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను తప్పనిసరి చేసే విధంగా పాలసీ తీసుకురావాలని కోరుతోంది.