
ఇజ్రాయిల్ లోని మౌంట్ మెరెన్ లో విషాదం జరిగింది. యూదుల పండుగ లాగ్ బౌమర్ సందర్భంగా జరిగిన సామూహిక ప్రార్థనల్లో ప్రమాదం జరిగి 44 మంది చనిపోయారు. 150 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు స్థానిక అధికారులు. స్టేజ్ కూలిపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ముందు చెప్పినా.. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత తొక్కిసలాటతో ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.