
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
మేడ్చల్ అడిషనల్ కలెక్టర్లు నర్సింహారెడ్డి, అగస్త్య
శామీర్పేట, వెలుగు : ప్రజావాణిలో జనాల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులు, దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య సూచించారు. శామీర్ పేట పరిధి అంతాయపల్లిలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించి.. 69 దరఖాస్తులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వీలైతే అక్కడికక్కడే వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.