బాలికలకు అన్ని రంగాల్లో సహకారం అందించాలి

V6 Velugu Posted on Jan 24, 2022

జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బాలికలకు అన్ని రంగాల్లో సహకారం అందించి, అవకాశాలు కల్పించే లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా ముందుకు తీసుకుపోవటం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. బాలిక‌ల అభ్యున్నతి మన జాతికి గర్వకారణమని.. భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకమన్నారు. బాలికల హక్కులతో పాటు బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో సమాజంలో అవగాహన కల్పించేందుకు యువత చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. వెంకయ్య నాయుడికి కరోనా సోకడంతో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు.     

 

మరిన్ని వార్తల కోసం         
నేటి యువతకు ఇవి చాలా అవసరం

చెరువు నీటిని తోడేస్తున్నారని గ్రామస్తుల ధర్నా

 

 

Tagged pride, Future, National Girls Day, Vice president Venkaiah, Inspriing

Latest Videos

Subscribe Now

More News