అగ్ని గుండాల కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం..తొక్కిసలాట

అగ్ని గుండాల కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం..తొక్కిసలాట

నల్లగొండ జిల్లా : నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పోలీస్, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. నిప్పు కణికలపై నడిచి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 

మరోవైపు.. అగ్ని గుండాల కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం చూపడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఒకరిపై మరొకరు పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు, శివసత్తులకు గాయాలయ్యాయి.