కాలిపోయిన కారులో మృతదేహాలు

కాలిపోయిన కారులో మృతదేహాలు

హర్యానాలోని భీవాని జిల్లాల్లో గుర్తించిన పోలీసులు

బజ్ రంగ్​దళ్ కార్యకర్తల పనేనని మృతుల ఫ్యామిలీ ఆరోపణ

భరత్ పూర్ : హర్యానాలోని భీవాని జిల్లాలో దారుణం జరిగింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ కారులో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఆనవాళ్లు గుర్తించలేనంతగా కాలిపోవడంతో వాటిని పోస్ట్ మార్టం కోసం తరలించారు. చనిపోయిన వారు రాజస్థాన్ లోని భరత్ పూర్  జిల్లాకు చెందిన వారని ఘటనా స్థలంలో దొరికిన ఐడెంటిటీ కార్డుల ఆధారంగా గుర్తించారు. ఆ ఇద్దరినీ బజరంగ్  దళ్ కు  చెందిన వ్యక్తులు కిడ్నాప్  చేశారని, వారే చంపి ఉండవచ్చని మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చనిపోయింది వారేనా కాదా అన్న విషయం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్  చేసింది. నిజానిజాలు బయటకు రాక ముందే ఈ ఘటనలో బజ్ రంగ్ దళ్​ హస్తం ఉందని చెప్పడం సరికాదని వీహెచ్​పీ పేర్కొంది.